జగనన్న మరో వరం.. బడికి వెళ్లే అమ్మాయిలకు బ్రాండెడ్ రక్ష

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలకు ప్రతి నెల వచ్చే నెలసరి ఇబ్బంది వేళలో.. వారికి అవసరమైన శానిటరీ నేప్ కిన్స్ ను పంపిణీ చేయాలని నిర్ణయించారు.

ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్లు కాకుండా.. బ్రాండెడ్ శానిటరీ నేప్ కిన్స్ అందజేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని సోమవారం (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కొత్త పథకాన్ని షురూ చేయాలని నిర్ణయించారు.