పంత్ నువ్వు రియల్ హీరో

ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ తొలి ఇన్సింగ్స్ లో విధ్వంసకర బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ ను నెటిజన్లు ఆకాశానికెత్తేస్తున్నారు.  సోషల్ మీడియా వేదికగా పంత్కు ప్రశంసలు దక్కుతున్నాయి. కీలక టైంలో పంత్  భారత జట్టును నిలబెట్టాడంటూ అతడిని సీనియర్ క్రికెటర్లు కీర్తిస్తున్నారు.  అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో  పంత్ అదరగొట్టాడు. సెంచరీ చేసి సత్తా చాటాడు. ఇది అసలు టెస్ట్ మ్యాచా.. లేక వన్డేనా అన్న రేంజ్లో విరుచుకుపడ్డాడు. కేవలం 116 బంతుల్లో 13 ఫోర్లు 2 సిక్సర్లతో విజృంభించాడు. 101 పరుగులు చేసి రూట్ బౌలింగ్ లో  అవుటయ్యాడు.