ఆకుతోటపల్లిలో వైభగంగా బొడ్రాయి ప్రతిష్ట వార్షికోత్సవం

ఆకుతోటపల్లిలో వైభగంగా బొడ్రాయి ప్రతిష్ట వార్షికోత్సవం

రచ్చబండ, ఆమనగల్లు : గ్రామస్తులంతా ఉమ్మడిగా కలిసిమెలిసి జరుపుకునే పండగ బొడ్రాయి పండగ అని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. ఆమనగల్లు మండల పరిధి ఆకుతోటపల్లి గ్రామంలో శని, ఆదివారాల్లో బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవ వేడుకలను భక్తి శ్రద్దలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

ఆదివారం ఉదయం గ్రామ బొడ్రాయికి అభిషేకం, అనంతరం సర్కార్ బోనం, గ్రామస్తుల బోనాలు భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి మహిళలు బోనాలతో ఊరేగింపుగా బయలుదేరి బొడ్రాయికి నైవేద్యం సమర్పించారు. బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గ్రామ ఆడపడుచులందరూ విచ్చేయడంతో పండగ వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మానవునికి నాభి ఎంత ముఖ్యమో గ్రామానికి నాభిశీల బొడ్రాయి అంత ముఖ్యమన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి శ్రీపాతి రజితా శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ నిట్ట మంగమ్మ నారాయణ, ఉప సర్పంచ్ కొప్పుల శేఖర్,వార్డు సభ్యులు కొండయ్య, గ్రామ యువ నాయకులు న్యాలపట్ల నరేందర్ రెడ్డి,నాయకులు పత్య నాయక్, వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.