- బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా సమన్వయకర్త ఎమ్మెల్సీ రమణ
రచ్చబండ, శంకర్ పల్లి: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చేవెళ్ల నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా సమన్వయకర్త, మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. సోమవారం శంకర్ పల్లి మండలంలోని మోకిలా గ్రామంలో రవీందర్ రెడ్డి గార్డెన్స్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రమణ మాట్లాడుతూ ఎనిమిదేండ్లలో తెలంగాణలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. 75 ఏండ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు తెలంగాణలో జరగలేదని, సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు.
వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ దే : ఎమ్మెల్సీ పట్నం
రాష్ట్ర రవాణా శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ దేనిని ధీమా వ్యక్తం చేశారు.
అన్ని వర్గాలకు కేసీఆర్ పథకాలు : ఎమ్మెల్యే కాలే
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అందుతున్నాయని తెలిపారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను ప్రవేశపెట్టి ఆడపడుచులను ఒక అన్నల, మామల ఆదుకుంటున్నారని చెప్పారు. 200 ఉన్న పింఛన్లను 2016కు పెంచి వితంతువులు, వృద్ధులు, బోదకాలు వ్యాధిగ్రస్తులకు, ఒంటరి మహిళలను ఆదుకుంటున్నారని కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి రైతులను ఆదుకుంటున్నారని తెలిపారు. రైతు బీమా, రైతుబంధు పథకాలు చేపట్టి రైతులను రైతులకు చేదోడుగా ఉంటున్నారని కొనియాడారు.
తెలంగాణ వచ్చాకే పల్లెల అభివృద్ధి : కేఎస్ రత్నం
మాజీ ఎమ్మెల్యే కెఎస్.రత్నం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు. గ్రామాలలో ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి, గ్రామంలో పచ్చదనం వెల్లివిరిసేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు, వైస్ చైర్మన్ కురుమ వెంకటేష్, మాజీ చైర్మన్ రాజు నాయక్, శంకర్ పల్లి పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, మండల, మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కె. గోపాల్, వి.వాసుదేవ్ కన్నా, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
ఇంకా జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు, మిర్జాగూడ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు, గోపులారం గ్రామ సర్పంచ్ పొడవు శ్రీనివాస్, జనవాడ, దొంతాన్పల్లి, మహారాజ్ పేట్, శేరిగూడ, పిల్లిగుండ్ల, ఇరుక్కుంట తండా సర్పంచులు గౌడ్ చర్ల లలిత నరసింహ, అశ్విని సుధాకర్, దోసాడ నరసింహారెడ్డి, సత్యనారాయణ, సత్యనారాయణ రెడ్డి, సంతోషి శంకర్ నాయక్, జనవాడ,
ఇంకా మోకిలా ఎంపీటీసీలు, నాగేందర్, సభావాత్ సరిత రాజి నాయక్, మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌడ చర్ల వెంకటేష్, యూత్ అధ్యక్షుడు, ఇంద్రసేనారెడ్డి, నాయకులు చేకూర్త గోపాల్ రెడ్డి, సాతా ప్రవీణ్ కుమార్, మన్నే లింగం ముదిరాజ్, నరసింహ గౌడ్, మిర్జాగూడ ఉపసర్పంచ్ శాంతి కిషన్ సింగ్, మాజీ ఎంపీపీ బీర్ల నరసింహ, బీఆర్ఎస్ పార్టీ గ్రామాల అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.