రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు పక్కన నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయానికి పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు తోటి అభిషేక్ గౌడ్ రూ.8లక్షలను ఆలయ కమిటీ సభ్యులకు సోమవారం అందించారు.
ఈ సందర్భంగా అభిషేక్ గౌడ్ మాట్లాడుతూ అయ్యప్ప దేవాలయానికి విరాళాన్ని అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు దండుమోహన్, మిరియాల శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, జంగయ్య, జూలకంటి పాండురంగారెడ్డి, శ్రీనివాస్, నర్సింగ్ రావు, సతీష్ పాల్గొన్నారు.