– సీపీఐ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి కన్వీనర్ కే రామస్వామి
రచ్చబండ. శంకర్ పల్లి: ఈ నెల 14 నుండి మే 15 వరకు సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పల్లె పల్లెకు సిపిఐ జాత కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని సిపిఐ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ కన్వీనర్ కె.రామస్వామి, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఎం ప్రభు లింగం పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల కేంద్రంలోని గెస్ట్ హౌస్ లో ఆదివారం సిపిఐ మండల కౌన్సిల్ సమావేశం మండల కార్యదర్శి పి. సుధీర్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలుపరచడంలో వైఫల్యం చెందాయని తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మతోన్మాదాన్ని బలపరుస్తూ బడుగు బలహీనవర్గాలపై దాడులు చేస్తున్నదని ఆరోపించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, ధరలు పెంచి సామాన్యులపై తను భారాన్ని మోపారని విమర్శించారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలలో డబుల్ బెడ్ రూములు 9 సంవత్సరాలు కావస్తున్న చేవెళ్ల నియోజకవర్గం లోని ఈ గ్రామాలకు కూడా అమలు చేయలేదని తెలిపారు. చేవెళ్ల మండల కేంద్రంలో గత 45 రోజులుగా గుడిసెల కోసం పోరాటం చేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే 700 గుడిసె వాసులకు పట్టాలి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి.సుధీర్ సాయి, కార్యదర్శి సయ్యద్ మోదిన్, సిపిఐ సీనియర్ నాయకులు కె. రామస్వామి, పరమయ్య, గంగయ్య, అంతయ్య, మల్లేష్, యాదయ్య, శేఖర్, పోచయ్య, శంకర్ పల్లి మండలం మహిళా సంఘం నాయకురాలు గౌరవ అధ్యక్షురాలు అమృతమ్మ, తదితరులు పాల్గొన్నారు.