రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మండలంలోని గ్రామాల్లో, మున్సిపల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో శ్రీరామనవమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో సీతారాముల కళ్యాణం ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. శంకర్ పల్లి పట్టణంలోని రైల్వే యార్డులోని రామాలయంలో సీతారాముల కళ్యాణం భక్తిశ్రద్ధలతో ప్రజలు జరుపుకున్నారు. స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్. విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ సీతారాముల కళ్యాణం ఉత్సవంలో పాల్గొన్నారు.