రాత్రికి రాత్రే లక్షాధికారైన రైతు

ఓ రైతు తెల్లారేసరికి లక్షాధికారి అయ్యాడు. పొలంలో పండిన పంటలతో కాదు.. పొలం దున్నుతుండగా దొరికిన వజ్రంతో.. ఏకంగా ఆ ఊరి ధనవంతుల జాబితాలో చేరిపోయాడు. దీంతో ఆ కుటుంబం సంభ్రమాశ్చర్యంలో మునిగి తేలుతోంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లాలో ప్రతాప్ సింగ్ అనే రైతుకు కొంత పొలముంది. దానిలో దున్నతుండగా మెరుస్తున్న రాయి దొరికింది. దానిని అక్కడి అధికారులు వజ్రంగా నిర్ధారించారు.

ఆ రైతుకు దొరికిన వజ్రం 11.88 క్యారెట్లు ఉన్నట్లు తేల్చారు. అది అత్యంత నాణ్యమైనదిగా గుర్తించారు. దాని విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని నిర్ధారించారు.

ఆ వజ్రం అమ్మగా వచ్చిన డబ్బుతో వ్యాపారం పెట్టుకుంటానని రైతు ప్రతాప్ సింగ్ తన మనోగతం తెలిపారు. అదే ప్రాంతంలో ఇటీవలే సుశీల్ శుక్లా అనే రైతుకు ఏకంగా రూ.1.20 కోట్ల విలువైన వజ్రం దొరకి అదృష్టం వరించింది.