ఉత్తరప్రదేశ్ లో యువతిపై దారుణం

మహిళలపై పట్ల దారుణాలు నిత్యకృత్యమయ్యాయి. ఏదో ఓ చోట దౌర్జన్యాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా నిలువరించలేక పోవడం శోచనీయం. దుండగులకు జంకు లేకపోవడం గర్హనీయం.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గోండాలో ఇటీవలే ఆటోలో తన అత్తతో కలిసి ఓ యువతి వెళ్తోంది. ఈ సమయంలో ఓ నలుగురు యువకులు ఆ యువతి పట్ల అమానుషంగా ప్రవర్తించారు.

ఆ యువతిని ఆటో నుంచి బయటకు లాగారు. రోడ్డు పక్కనున్న చెట్ల పొదల్లోకి బలవంతంగా లాక్కెళ్లారు. దౌర్జన్యంగా తమకు అడ్డేలేదనుకొని ఆమె బట్టలు చించేశారు. ఆనక ఆ దుర్మార్గాన్ని వారు వీడియోలో చిత్రీకరించారు.

ఆ యువతి పట్ల వారి నిర్వాకంతో కూడిన వీడియోను ఆ దుండగులు ఆన్ లైన్ లో పోస్టు చేశారు. ఈ విషయంపై ఆ బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

యువతి ఒంటిపై బట్టలు చింపి కొందరు రాక్షసుల వోలే వికృతానందం పొందడంపై ఆ రాష్ట్రంలో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇంకా సమాజంలో మహిళలను ఆటబొమ్మగా చూస్తుండటం క్షమించరాని నేరం. ఇలాంటి దుండగులపై కఠిన చట్టాలు రావాలని కోరుకుందాం.