కొమ్మ కొమ్మకో.. అనసూయ

కొమ్మ కొమ్మకో సన్నాయి.. కోటి రాగాలు ఉన్నాయి.. అన్న పాట గుర్తొస్తుంది కదూ.. ఎందుకంటే కొమ్మ కొమ్మపై అనసూయ పదనిసలు చూస్తే అలాగే అనిపిస్తుంది. ఆమె ఓ బీచ్ పక్కన దిగిన ఫొటోలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

 

బుల్లి, వెండితెర అందాల తార అనసూయ అందాల ఆరబోత అభిమానులకు విందు భోజనమే. ప్రేక్షకుల్లోనూ క్యూరియాసిటీని పెంచుతుంది. పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా తప్పకుండా ఆసక్తిని చూపుతారు.

అనసూయ కూడా ఐ డోంట్ కేర్.. అనుకుంటూ తను అనుకున్నట్లుగానే చేస్తోంది. కురచ డ్రెస్సులతో ఉన్న ఫొటోలను తన అభిమానులకు పంచుతుంది. నెటిజన్స్ కూడా అంతే మొత్తంలో రెస్పాండ్ అవుతూ ఉంటారు.

తాజాగా అనసూయ తన ఫేస్ బుక్ వాల్ పై ఆమె పెట్టిన ఫొటోలు వైరల్ గా మారాయి. పొట్టి గౌను వేసుకున్న ఆమె ఓ బీచ్ పక్కనున్న చెట్టు కొమ్మపై కూర్చునేందుకు తెగ హైరానా పడింది. ఆమె పెట్టిన నాలుగు ఫొటోలు ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి.

కొమ్మపైకి ఎక్కుతూ, ఎక్కాక, తాపీగా కూర్చొని, నీటిలోకి కాళ్లు వేలాడుస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాయా ఫొటోలు. అక్కడ ఆనందంగా గడుపుతూ తెగ సంబుర పడింది. దీనిపైనా పాజిటివ్, నెగిటివ్ కామెంట్లు సాధారణంగానే వచ్చాయి.