Rahul gandhi.. రాహుల్ గాంధీతోనే దేశానికి భవిష్యత్

  • యూత్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పాలకుర్ల రవికాంత్ గౌడ్
  • కొనసాగుతోన్న హాత్ సే హాత్ జోడో యాత్ర

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : దేశానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీయే భవితవ్యమని యూత్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పాలకుర్ల రవికాంత్ గౌడ్ అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం ఎక్వయిపల్లి గ్రామంలో సోమవారం హాత్ సే హాత్ అభియాన్ జోడో యాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నిర్వహించిన యాత్ర దేశవ్యాప్తంగా భారీ ఎత్తున విజయవంతం అయ్యిందని తెలిపారు.

ఏఐసీసీ హామీలు అయిన రూ.500కే గ్యాస్, తదితర పథకాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేపట్టిన యాత్రలకు ఇసుకేస్తే రాలనంత జనాలు వస్తూ యాత్రకు రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.

త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికల్లో కల్వకుర్తితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, లిక్కర్ స్కాం లో బిడ్డ కవిత, పేపర్ లీకేజీలో కేటీఆర్ పాత్రను సీబీఐ ఎంక్విరీ ద్వారా తేల్చాలని డిమాండ్ చేశారు.

త్వరలో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ అభియాన్ యాత్ర కొనసాగుతాందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులని కలుపోకొని కాంగ్రెస్ ని గెలిపించి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపర్చలని కోరారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కడ్తాల్ మండల అధ్యక్షుడు బిచ్యనాయక్ అధ్యక్షతన వహించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో నూతన నియామక కమిటీల ప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, డీసీసీ అధికార ప్రతినిధి, ఎంపీటీసీ సభ్యులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు బిక్య నాయక్, తలకొండపల్లి మాజీ అధ్యక్షుడు గుజ్జుల మహేశ్ పాల్గొన్నారు.

ఇంకా కల్వకుర్తి యువజన కాంగ్రెస్ అద్యక్షుడు అనిల్ గౌడ్, నాగరకర్నూల్ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు అదిరాల అన్వేష్ గౌడ్,  కడ్తాల్ మండల అధ్యక్షులు హిర సింగ్, పాక్స్ డైరెక్టర్ చేగురి వెంకటేష్, రేవంత్ రెడ్డి మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు అసిఫ్ అలీ, విజయ్ నాయక్, నరసింహాచారి, నరేష్ ముదిరాజ్, అన్నెపు వెంకటేష్, అంజి, చోటే, రమేష్, యదయ్య గౌడ్ తదితరాలు పాల్గొన్నారు.