తెలుగు భాష గొప్పదనం తెలుసుకో..

మధురమైన మాత్రు భాష.. ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్.. దేశ భాషలందు తెలుగు లెస్స.. సృష్టికర్తల గొప్ప వరం.. అని తెలుగు భాషకు ఉన్న గొప్పదనాలు. ఈ భాష పుట్టుక నుంచి నేడు, మరేనాడైనా నిండుతనంగా ఉంటుంది. ఇలాంటి భాష గురించి కొందరికి తెలిసినా ఎందరికో తెలియని వాస్తవాలు తెలుసుకుందాం రండి..

క్రీస్తుపూర్వం 400 సంవత్సరాల నుంచే తెలుగు భాష ఉనికిలో ఉంది.

మూడు లింగాల దేశం, త్రిలింగ దేశం అని పిలువబడే ప్రాంతంలో పలికే భాషే తెలుగు అని నానుడిలో ఉంది. ఒక హిందూ పురాణం ప్రకారం, శివుడు మూడు పర్వతాలపై తన లింగస్వరూపాన్ని నిలిపాడని అంటారు. అవియే తెలంగాణలోని కాళేశ్వరం, రాయలసీమలోని శ్రీశైలం, కోస్తా ప్రాంతంలోని భీమేశ్వరం శివాలయాలుగా భావించి, తెలుగు ప్రజలు శివుడిని పూజిస్తారు. ఈ త్రిలింగాల నుంచి తెలుగు భాష గుర్తింపులోకి వచ్చిందని అంటారు.

ఈ తెలుగు భాషను తెనుగు లేదా తెలుంగు లేదా తెనుంగు అని కూడా పిలుస్తారు.

తెలుగు భాషలో మాత్రమే ప్రతి పదం అచ్చు శబ్దంతో ముగుస్తుంది. తూర్పున ఉన్న దేశాలు, రాష్ట్రాలలో ఏ భాషకూ ఇంతటి ప్రాముఖ్యత లేదు.

తెలుగు భాషలో మాత్రమే అత్యధిక సంఖ్యలో జాతీయాలు, సామెతలు ఉన్నాయి. మొదటి నుంచి చివరి వరకు చదివినప్పుడు రామాయణం, చివరి నుంచి మొదటికి చదివినప్పుడు మహాభారతం అర్ధం వచ్చే కచికలతో (పాలిండ్రోమ్) ఉన్న 40 శ్లోకాలు తెలుగులో తప్ప ఏ భాషలోనూ లేవు.

ఒకే ఒక అక్షరంతో వ్రాయబడు పద్యాలు ఏకాక్షర పద్యాలు తెలుగు భాషలో తప్ప మరే ఇతర భాషలోనూ లేవు.

తెలుగు భాష దాని సృష్టికర్తల నుంచి ఉద్భవించిన గొప్ప వరం అని ప్రపంచంలో ఉన్న అన్ని మతాల పెద్దలు, మన ఋషులూ ఉద్ఘాటించారు.

శ్రీ కృష్ణదేవరాయ శ్రీకాకుళంలోని, శ్రీకాకుళాంధ్ర మహా విష్ణుదేవుని సందర్శించి తన గ్రంథం ఆముక్త మాల్యదను అక్కడే రచించారు. దానిని శ్రీవారికి అంకితమిచ్చి నివాళులర్పించారు. ఆంద్ర మహా విష్ణువు రాయల వారికి స్వప్నంలో కనబడి, దేశ భాష లందు తెలుగు లెస్స అని తెలిపి, తన సామ్రాజ్యంలో తెలుగుని అధికార భాషగా ప్రకటించమని రాయల వారిని ఆదేశించారని చరిత్రలో తెలుపబడినది.

తెలుగు భాష మాట్లాడటం ద్వారా మనిషి శరీరంలో సుమారు 72,000 న్యూరాన్‌లను సక్రియం చేస్తుంది. సైన్స్ నిరూపించిన ప్రపంచంలోని ఏ భాషకైనా ఇది అత్యధికం కావడం విశేషం.

2012 లో అంతర్జాతీయ ఆల్ఫాబెట్ అసోసియేషన్ ప్రపంచంలోని రెండొవ ఉత్తమ స్క్రిప్ట్ గా తెలుగును ఎన్నుకుంది. కొరియన్ భాష ర్యాంక్ నంబర్ 1.

ప్రఖ్యాత కవి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్ని భారతీయ భాషలలో తెలుగు మధురమైనదని కొనియాడారు.

16 వ శతాబ్దంలో ఇటాలియన్ ఎక్స్ ప్లోరర్ నికోలో డి.కాంటి తెలుగు భాషలోని పదాలు ఇటాలియన్‌లోని మాదిరిగానే అచ్చులతో ముగుస్తుందని కనుగొన్నారు. అందుకే దీనిని “ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అని పిలుస్తారు.

భారతదేశంలో స్థానికంగా మాట్లాడేవారి సంఖ్య (75 మిలియన్ల మంది)లో తెలుగు 3వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మాట్లాడే భాషల ఎథ్నోలాగ్ జాబితాలో తెలుగు 15వ స్థానంలో ఉండటం విశేషం.

శ్రీలంకకు చెందిన ఒక జాతి శ్రీలంక జిప్సీ ప్రజలు ఎక్కువగా తెలుగే మాట్లాడతారు. మయన్మార్‌లో చాలా తెలుగు కమ్యూనిటీలు ఉన్నాయి.

సుమారు 200ఏళ్ల క్రితం తెలుగు మాట్లాడే ప్రజలను సుమారు 400 మందిని మారిషస్ ప్లాంటేషన్ వర్కర్లుగా అక్కడికి తీసుకెళ్లారు, ఇప్పుడు ఆ దేశపు ప్రధానమంత్రి వారి వారసులలో ఒకరు కావడం గమనార్హం.

ఇలా ఎన్నో విశిష్టతలు కలిగిన తెలుగును అమూల్యంగా భావిద్దాం. ముందు తరాలకు అందిద్దాం. ప్రపంచంలోనున్న తెలుగు వారందరూ, తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను గ్రహించి, తెలుగు భాషను ప్రోత్సహించి, తెలుగు వ్యక్తిగా పుట్టినందుకు గర్వపడాలి.