ముద్దుగుమ్మల యోగాసనాలు

ప్రపంచ యోగా దినోత్సవాన్ని మంగళవారం జరుపుకున్నారు. మన జీవన విధానంలో యోగా తప్పని సరి అని, నిత్యం పాటించాలని ఎందరో ప్రముఖులు పిలుపునిచ్చారు. అయితే కొందరు సినీ తారలు యోగా భంగిమలో ఉన్న చిత్రాలను షేర్ చేస్తూ యోగా డే శుభాకాంక్షలు తెలిపారు.

సోనాల్ యోగ ముద్ర
సోనాల్ చౌహాన్ సినిమా నటి. రెయిన్ బో తెలుగు సినిమాతో టాలీవుడ్ చిత్రంలో ఆమె నటించింది. ఆమె మోడల్, గాయని కూడా. హిందీ, కన్నడ, తమిళ చిత్రాల్లో కూడా యాక్ట్ చేసింది. అయితే యోగా దినోత్సవం సందర్భంగా యోగా ముద్రలో కూర్చొని ఉన్న తన చిత్రంతో ట్విట్టర్ వేదికగా ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సెగల్ ఉస్త్రాసనం
సొన్నల్లి సెగల్ కూడా భారతీయ సినీ నటి. ఆమె హిందీలో పలు చిత్రాల్లో నటించింది. నా ఉస్త్రాసనంతో యోగాడేకి సిద్ధంగా ఉన్నా.. అన్న కొటేషన్ తో అదే యోగ ముద్రలో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఈ యోగాసనంతో కలిగే లాభాలను వివరించింది.

మౌన ముద్రలో అనన్య నాగళ్ల
అనన్య నాగళ్ల అచ్చమైన తెలుగు నటి. మల్లేశం, వకీల్ సాబ్ చిత్రాల్లో నటించింది. సైమా అవార్డుకు సైతం ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఆమె మౌన ముద్రలో యోగాసనం చేస్తూ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది.

స్వస్తిక్ ఆకారంలో యోగా
ప్రియం వద అన్న బిహార్ యువతి స్వస్తిక్ ఆకారంలో యోగాసనం చేస్తూ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ట్విట్టర్ లో షేర్ చేసింది. స్వస్తిక్.. పర్ ఫెక్ట్ ఫార్మేషన్ ఆఫ్ యోగా.. అన్న కొటేషన్ షేర్ చేసింది.