హైదరాబాద్ లో మరో గ్యాంగ్ రేప్

జూబ్లీహిల్స్ పబ్ రేప్ ఘటన తరహాలోనే హైదరాబాద్ నగరంలో మరో దుర్ఘటన వెలుగు చూసింది. బాలికపై నలుగురు దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ నగర పరిధిలోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికను నలుగురు ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేశారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాలికను తీసుకొచ్చి రోడ్డుపై వదిలి వెళ్లారు.

ఇదిలా ఉండగా బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ లో ఈనెల 18న మిస్సింగ్ కేసు నమోదైంది.

అయితే దుర్ఘటన అనంతరం ఇంటికి చేరుకున్న బాధిత బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

వరుస ఘటనలతో హైదరాబాద్ నగరం ఇమేజ్ డ్యామేజీకి దారితీస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. మహిళలు, యువతులకు, బాలికలకూ రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.