ఆ ఆలయంలో వేలాది ఎలుకలున్నాయి.. ఎక్కడ, ఎందుకున్నాయో తెలుసా?

ఒక ఆలయంలో 25వేలకు పైగా ఎలుకలు ఓకే చోట జీవిస్తున్నాయి. అవి జనం అందించే నైవేద్యాన్ని ఆరగిస్తుంటాయి. వేలాది జనం వస్తున్నా ఏమాత్రం జంకకుండా ఆలయంలో స్వేచ్ఛగా తిరిగాడుతుంటాయి.

రాజస్థాన్‌ రాష్ట్రంలోని దేశ్‌నోక్‌లోని కర్ణి ఆలయం ఉంది. ఆలయ దేవత కర్ణికి ఈ ఆలయం అంకితం చేయబడిందట. ఈ ఆలయ మాతను జోద్ పూర్ బికనీరు రాజవంశీయుల కులదైవంగా భావిస్తారు. ఆ ఆలయాన్ని 15వ శాతాబ్దంలో గంగాసింగ్ అనే రాజు నిర్మించాడు. 20వ శతాబ్ద ఆరంభంలో పునర్నిర్మించారు.

ఈ ఆలయం ప్రస్తుతం 25,000 ఎలుకలకు నిలయంగా ఉంది. వాటిలో నల్ల ఎలుకలు అధికంగా ఉన్నాయి.
పవిత్రంగా గౌరవించబడే, దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తున్న ఈ ఎలుకలు ఆలయ ప్రాంగణంలో స్వేచ్ఛగా తిరుగుతాయి. సందర్శకులు ఎలుకలకు ఆహార నైవేద్యాలు అందజేస్తూ వాటి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు.

ఇక్కడి ఎలుకలను కబ్బాలు అని పిలుచుకుంటారు. వాటికి దైవత్వముందని భావిస్తారు. భక్తులు నైవేద్యంగా అందించే పాలు, పెరుగు, పండ్లు, స్వీట్లను అవి ఆరగిస్తుంటాయి.

మరో విశేషమేమిటంటే.. ఆలయంలో స్వేచ్ఛగా తిరిగే ఎలుకలు భక్తుల పాదాల మీదుగా వెళ్తుంటాయి. ఎవరి పాదాల మీదుగా వెళ్తాయో వారికి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని, వారికి అదృష్టం త్వరలో కలిసొస్తుందని భావిస్తారట.