భర్తను వదిలేసి ప్రియుడితో ఉంటున్న మహిళకు దారుణ శిక్ష

వివాహేతర బంధాలు దారుణ ఘటనలకు దారి తీస్తున్నాయి. భరించలేని కొందరు తనువులు చాలిస్తుండగా, మరికొందరు హత్యలకు గురవుతున్నారు. ఇంకొందరు శిక్షలకూ బలవుతున్నారు. అలాంటి కోవలో ఇక్కడ ఓ మహిళకు దారుణ శిక్ష అమలైంది.

కట్టుకున్న భర్తను వదిలేసిన ఓ మహిళ ప్రియుడి ఇంట్లో ఉంటోంది. పర్యవసానంగా ఆ మహిళకు గ్రామస్థులు దారుణ శిక్ష అమలు చేశారు. ఆలస్యంగా సోమవారం వెలుగు చూసిందీ ఘటన.

మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ జిల్లా బోర్ పదవ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకొంది. భర్తను వదిలేసి ఆ మహిళను గ్రామస్థులు బెల్టులు, కొరడాలతో తీవ్రంగా కొట్టారు. నేలపై సొమ్మసిల్లి పడిపోయినా దారుణంగా కొట్టారు. మరో దారుణమేమిటంటే ఆమె భర్తను భుజాలపై ఎక్కించి ఊరంతా తిప్పించారు.

సమాచారం తెలిసి పోలీసులు ఆ ఊరికి వచ్చి ఆ మహాళఆను కాపాడారు. 12మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ మహిళపై దాడి చేసి, ఊరేగించిన ఘటనను చిత్రీకరించిన వీడియో వైరల్ గా మారింది.