శంషాబాద్ ఔటర్ రింగురోడ్డుపై ఘోర ప్రమాదం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఆగి ఉన్న కంటెయినర్ వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

రోడ్డుపై ఓ ట్రాన్స్ పోర్టుకు చెందిన వాహనం నిలిపి ఉంచడంతో అదుపు తప్పిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీలోకి కారు ఇరుక్కు పోయి నుజ్జునుజ్జయింది. దానిలో ప్రయాణిస్తున్న ముగ్గురు పూర్తిగా ఇరుక్కు పోయారు.

ప్రమాదంలో మృతిచెందిన వారిది మహారాష్ట్ర ఔరంగాబాద్ కు చెందిన ఆనంద్, సంపత్, రంగనాథ్ గా గుర్తించారు. వారు తిరుపతి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకొందని స్థానిక పోలీసులు తెలిపారు. శంషాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.