వంటింట్లో మంట.. గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగిందంట!

మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా.. గతంలో కంటే మరో రూ.50 అదనంగా దగ్గర పెట్టుకోండి. ఎందుకనుకుంటున్నారా.. మళ్లీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందండోయ్.. ఈరోజు నుంచే అమలండోయ్.

ఇటీవలే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.183.50 మేరకు తగ్గించిన చముర సంస్థలు తాజాగా 14.2 కిలోల గృహావసరాల గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 మేర పెంచాయి.

ఈ మేరకు హైదరాబాద్ నగరంలో రూ.1055 నుంచి రూ.1105కు పెరగనుంది. అదే ఢిల్లీలో రూ.1003గా ఉన్న ధర రూ.1053కు పెరిగింది.

ఇప్పటికే మార్కెట్లో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన నిత్యావసరాల ధరలతో సామాన్య, మధ్య తరగతి వర్గాల జీవనం అస్తవ్యస్తంగా మారింది. పెట్రో ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ఆయా వర్గాలపై తాజాగా గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదలతో మరింత భారం పడనుంది.