రాంగోపాల్ వర్మ డౌటానుమానం మామూలుగా లేదు!

రచ్చబండ : ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మది ఎవరికీ అర్థం కాని వ్యక్తిత్వం అంటుంటారు కొందరు. ఆయనది వితండ వాదమని ఇంకొందరు అంటుంటారు. ఏదీ లాజిక్ లేకుండా మాట్లాడరని ఆయనను సమర్థించే వారంటుంటారు.

సరే ఆయనది ఎలాంటి వ్యక్తిత్వమైనా తాజాగా ఆయన ట్విట్టర్లో చేసిన ఓ పోస్టు జనాన్ని ఆలోచింపజేస్తోంది. జనాల్లో డౌటానుమానాన్ని మరింతగా పెంచింది.

అదేంటంటే.. మానవులు కోతుల జాతి నుంచి ఉద్భవించినట్లయితే.. మరి ఇప్పటికీ మన ఎదుట కోతులు ఎందుకు ఉన్నాయి.. అన్నది ఆయన ప్రశ్న.

అంటే నాటి కోతుల జాతి మానవులుగా రూపాంతరం చెందితే అవి మనకు నేడు కనిపించవనేది రాంగోపాల్ వర్మ డౌటు. మరి ఏది నిజమో, ఏది కాదో సైంటిస్టులే సెలవియ్యాలి.