పాములతో ఆ ఊరి ప్రజల సహజీవనం.. ప్రతీ ఇంటిలో ప్రత్యేక స్థలం కేటాయింపు

ఆ ఊరిలో పాములు, మనుషులు కలిసే నివసిస్తారు. పాములను పూజించే ఆచారం ఉందక్కడ. పాములు మనుషుల్లాగే స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. ఎవరూ ఏమీ అనరు. మరి వింతేకదా..

మహారాష్ట్రలోని షెట్పాల్ అనే గ్రామంలో పాములను పూజించే ఆచారం ఉంది. ఈ కారణంగా ఆ ఊరిని పాముల దేశం అని కూడా పిలుచుకుంటారు. గ్రామస్థులు పాములతో సహజీవనం చేస్తుంటారు.

గ్రామంలో తిరుగుతున్న పాములను ఎవరూ ఏమీ అనరు. గ్రామంలోని ప్రతీ ఇంటిలో పాములు నివసించడానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తారు.

పాముల్లో ముఖ్యంగా భారతీయ నాగుపాములు ఆ ఊరిలో మనుషుల్లాగే స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. పిల్లలు పాములతో ఆడుకుంటారు. మెడలో వేసుకొని తిరుగుతారు. పాములు మాత్రం పిల్లలకు ఎలాంటి హాని చేయవు.

ఇప్పటికీ గ్రామంలో పాము కాటేసిన ఘటన చోటుచేసుకోలేదంటే నమ్మండి. పాములతో ఎలాంటి హాని జరిగిన కేసులూ అక్కడ నమోదు కాలేదంటే వింతే కదా.