• ప్రపంచ కుబేరుడు ఏం చెప్పారు?
జీవితంలో ప్రతీ ఒక్కరూ సక్సెస్ సాధించాలని కోరుకుంటారు. మరి ఆ సక్సెస్ గురించి ఎవరికి తోచిన రీతిలో వారు భాష్యాలు చెప్తూ ఉంటారు. ఎవరు చెప్పింది ఎలా ఉన్నా ప్రపంచ కుబేరుడైన వారెన్ బఫెట్ చెప్పిన విషయం అందరినీ ఆలోచింపచేస్తోంది.
సక్సెస్ నిర్వచనం చెప్పాలంటే జీవితాన్ని చూడాలంటాడు వారెన్ బఫెట్. తన వయసుకు వచ్చినప్పుడు అందరికీ జీవితమంటే ఏమిటో తెలుస్తుందన్నారు. ఇప్పుడాయన వయసు 91 సంవత్సరాలు.
సక్సెస్ అంటే బ్యాంకు బ్యాలెన్స్ కాదు. పరపతిలో అది ఉండదు. మనల్ని ప్రేమించే వారు ఎందరు ఉన్నారు అన్నదే సక్సెస్ కు అసలైన నిర్వచనం.. అని వారెన్ బఫెట్ సూత్రీకరించాడు.
బిలియన్ డాలర్ల డబ్బు ఉంది కదా.. అని అంతే స్థాయిలో ఎక్కువ మంది నుంచి ప్రేమను పొందగలం అనుకోవడం పొరపాటు.. అని బఫెట్ తేల్చి చెప్పారు. ప్రేమించే వ్యక్తులు అధికంగా ఉన్నవారే సక్సెస్ సాధించినట్లన్నమాట. అందుకే జీవితంలో డబ్బు సంపాదన యావ కన్నా.. ప్రేమించే వ్యక్తులను ఎక్కువగా సంపాదించుకోవాలి మరి.