అనసూయ భరద్వాజ్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరపై ఫేమస్ అయిన ఆమె ఇటీవల వెండితెరపైనా తన అందచందాలతోనే కాకుండా నటనా చాతుర్యంతో మెప్పిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తనకు నచ్చని విషయాలపై అట్లే రియాక్ట్ అవుతుంటారు. తనపై ఎన్ని కామెంట్లు వచ్చినా డోంట్ కేర్.. నాకు నా కెరీరే ముఖ్యం.. అంటూ ఆమె ముందుకెళ్తోంది.
అయితే సామాజిక బాధ్యతగానూ తన వంతు కృషి చేస్తూ వస్తున్న నటి అనసూయ తాజాగా ఆమె చేసిన ఓ పోస్టు అందరినీ ఆలోచింపజేస్తోంది. ఇట్టే కట్టిపడేసేలా ఆమె చీరలో ఉన్న ఫొటోలను అప్ లోడ్ చేసింది. ఆమె పోస్టుపై ఎక్కువ మంది మెచ్చుకొని, పరిణతి చెందిందని కామెంట్ల వర్షం కురిపించారు.
అయితే ఆ పోస్టు ఇంగ్లిషులో ఇలా ఉంది. .. listen to your heart. not to peoples opinions.. అని అనసూయ పోస్టు చేసింది. దానర్థం ఏంటంటే.. ‘‘మీరు మీ హృదయం చెప్పింది వినండి.. ఇతరుల అభిప్రాయాలను కాదు..’’ అన్నమాట. అయితే నీ హృదయం చెప్పింది నువ్వు వింటున్నావా.. అని నెటిజన్లు కొందరు చిలిపిగా ఆమెను ప్రశ్నిస్తున్నారు.