నయనతార పెళ్లవుతుందోచ్!

ఎన్నో మలుపులు తిరిగిన సినీ హీరోయిన్ నయనతార జీవితం ఈ సారైనా గాడిలో పడుతుందా.. లేదా.. అన్న ఉత్కంఠ అభిమానులు, ప్రేక్షకుల్లో నెలకొంది. తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తోనైనా మూడుముళ్ల బంధం ముడిపడాలని వారంతా కోరుకుంటున్నారు.

సౌతిండియా లేడీ సూపర్ స్టార్ గా ఫేమస్ అయిన నయనతార మొదట తమిళ నటులు శింబు, ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపింది. శింబుతో ప్రేమతోనే ఫుల్ స్టాప్ పడింది. ప్రభుదేవాతో పెళ్లి పీటల దాకా వెళ్లి ఆగిపోయింది.

అయితే గత కొన్నాళ్లుగా యువ దర్శకుడు విఘ్నేష్ శివన్, నయనతార ప్రమాయణం సాగుతోంది. ఎప్పటి నుంచో చెట్ట పట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. నిశ్చితార్థం కూడా అయిందని వెల్లడైంది. అయితే పెళ్లి విషయంలోనే ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

పెళ్లి, కుటుంబం, కెరీర్ పై కలలు కన్న ఆ జంట పెళ్లి ద్వారా ఒక్కటయ్యే రోజు రానే వచ్చింది. జూన్ 9న వీరు వివాహ బంధంతో ఒక్కటి కానున్నట్లు టాక్. తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో వీరిద్దరి పెళ్లి జరగనుంది. దీనికోసం ఇప్పటికే వివాహ వేదిక కోసం తిరుమలలో సంప్రదించినట్లు వార్తలొచ్చాయి.