గాంధీభవన్ లో రాహుల్ దిశానిర్దేశం

ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనలో భాగంగా రెండో రోజైన శనివారం గాంధీభవన్ లో ఆ పార్టీ ముఖ్య నేతలకు సందేశమిచ్చారు. వచ్చే ఎన్నికల్లోగా పార్టీ తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ నేతల ప్రవర్తన, పార్టీ నియమావళి, లక్ష్యాల సాధనపై దిశానేర్దేశం చేశారు. రాహుల్ ఉపన్యాసం ఆయన మాటల్లోనే..

• వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నడుమే పోటీ ఉంటుంది.
• తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం బాగుపడింది.
• కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ పొత్తు ఉండదు.
• కేసీఆర్ వద్ద అన్ని శక్తులూ ఉన్నాయి. కానీ జన బలం మాత్రం లేదు.
• ప్రజల శక్తిని మించింది ఏదీ లేదు.

కాంగ్రెస్ ప్రధాన లక్ష్యాలు
• తెలంగాణ ప్రజల కలలను నిజం చేయడమే కాంగ్రెస్ పార్టీగా మన లక్ష్యం.
• విద్య, వైద్యం మన ప్రాధాన్యతలు.
• ఈ లక్ష్యాల సాధనకు మన పార్టీలో ఐకమత్యం ఉండాలి.

మెరిట్ ఆధారంగానే సీట్లు
• వచ్చే ఎన్నికల్లో మెరిట్ ఆధారంగానే సీట్లు కేటాయిస్తాం.
• ప్రజల్లో ఉండి పనిచేసే వారికే టికెట్లు.
• టికెట్ వస్తుందన్న బ్రమల్లో ఎవరూ ఉండొద్దు.
• పనిచేసే వారికి తప్పక ప్రతిఫలం ఉంటుంది.
• క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్ తీసుకొని టికెట్లిస్తాం.
• ఆ తర్వాత నన్ను ఎవరూ అనొద్దు.
• ఎంత సీనియర్లయినా, ఎంత రాజకీయ చరిత్ర ఉన్న వారైనా ఇది వర్తిస్తుంది.
• హైదరాబాద్ లో కూర్చుంటే టికెట్లు రావు.
• ఢిల్లీకి వస్తే మొత్తానికే నష్టం జరుగుతుంది.

డిక్లరేషన్ ను ప్రజల్లో తీసుకెళ్లాలి
• వరంగల్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీకి, రైతులకు మధ్య నమ్మకం కలిగించేది.
• దీనిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి.
• అది అందరికీ అర్థమయ్యేలా వివరించాలి.
• వచ్చే నెలరోజ్లోనే ఈ పని పూర్తి చేయాలి.

మీడియాకు ఎక్కొద్దు
• మీడియా ముందు ఏది పడితే అది మాట్లాడొద్దు.
• ఏదైనా ఉంటే అంతర్గత సమావేశాల్లో మాట్లాడాలి.
• మీడియాకు ఎక్కితే ఉపేక్షించేది లేదు.

ఉద్యమకారులకు ఆహ్వానం 
• కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసే తెలంగాణను ఇచ్చాం.
• టీఆర్ఎస్ పై పోరాడేందుకు రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి.
• తెలంగాణ నుంచి కేసీఆర్ ను తరిమికొట్టే బాధ్యత మనందరిది.