సరళ ఇంటికి సాయి పల్లవి

ఖమ్మం : విరాటపర్వం సినిమా ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా. నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ లోని ఓ ప్రేమకథను తెరకెక్కించారు. ఆ సినిమాలోని హీరోయిన్ పాత్ర తూము సరళదేనని ఆమె కుటుంబ సభ్యులే స్వయంగా ప్రకటించారు.

ఆ తూము సరళ పాత్రను ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి పోషించారు. అద్భుత నటనతో మెప్పించారని ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపించింది.

ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామానికి చెందిన తూము భిక్షం చిన్న కూతురే తూము సరళ. సరళ అక్క వడ్డే పద్మ ఐద్వా నాయకురాలిగా కొనసాగుతున్నారు.

సినిమాలో సరళ పాత్ర పోషించిన సాయి పల్లవి ఆదివారం వారింటికి స్వయంగా వెళ్లారు. ఈ సమయంలో గ్రామంలో సందడి నెలకొంది. సాయిపల్లవిని సరళ కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించి, సత్కరించారు. తమ ఇంటి ఆడకూతురుకు చీర, జాకెట్ పెట్టి సాగనంపినట్టే సాయి పల్లవిని ఆదరించారు.