యాదాద్రి కొండపై తప్పిన పెను ప్రమాదం

ఆలేరు : యాదాద్రి- భువనగిరి జిల్లాలోని యాదాద్రి కొండపై పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం నుంచి 50 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడారు. దీంతో అటు అధికారులు, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి కొండపై నుంచి కిందికి వస్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయాయి. డ్రైవర్ చాకచక్యంతో పక్కనే ఉన్న పోలీస్ చెక్ పోస్ట్ ను బస్సును ఢీకొట్టించాడు.

ఘటన జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.