రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : గురుదేవో భవ.. అంటారు. గురువును మించిన దైవం లేదంటారు. విద్యాబుద్ధులు నేర్పిన ఎందరో గురువులకు గురు దక్షిణ ఇచ్చుకుంటారు. కానీ అలాంటి గురు స్థానానికి మచ్చ తెచ్చేలా ఓ టీచర్ చేసిన నిర్వాకం గురు పూజోత్సవం రోజే వెలుగులోకి వచ్చింది. ఈ నిర్వాకానికి గ్రామస్థులు దండన విధించారు.
బిహార్ రాష్ట్రంలోని సివాన్ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఒక టీచర్ ట్యూషన్ చెప్పేవాడు. ఆ ట్యూషన్ కు వచ్చే ఓ విద్యార్థినిపై అతను అనుచితంగా ప్రవర్తించాడు. తన ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఆ విద్యార్థినిని లైంగికంగా వేధించసాగాడు.
ఈ విషయం తెలిసిన గ్రామస్థులు నిందితుడిని చితకబాధారు. ఆగ్రహంతో అతనితో గుంజీలు తీయించారు. దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్తా వైరల్ గా మారింది. పోలీసులకు చేరడంతో వారొచ్చి ఘటనపై దర్యాప్తు చేపట్టారు.