జెయింట్ స్వింగ్ ఫెయిల్.. 40 అడుగుల ఎత్తు నుంచి పడిన యంత్రం

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : పర్యాటకుల సరదా ప్రాణాల మీదికి తెచ్చింది. ఉత్తేజంతో గిర్రున తిరిగేయచ్చు అనుకున్న వారి ఆనందం క్షణాల్లో ఆవిరైంది. సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి జెయింట్ స్వింగ్ తిరుగుకుంటూ ఒక్కసారిగా కింద పడటంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీ నగరంలోని ఓ ఎగ్జిబిషన్ లో 50 మందితో జెయింట్ స్వింగ్ చుట్టూ తిరుగుతూ పైకి వెళ్లింది. ఫెయిలై ఒక్కసారిగా అది వేగంగా కింద పడి తునాతునకలైంది. దానిలోని 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఎక్కువ మందికి నడుములు విరిగగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.

ఒళ్లు గగుర్పొడిచేలా జరిగిన ఈ ఘటనపై ఎగ్జిబిషన్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాయాలైన వారిని పోలీసులు స్థానికుల సహాయంతో చికిత్స అందిస్తున్నారు.