నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

రచ్చబండ : శాసనసభ, శాసన మండలి సమావేశాలు మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభం కాగానే మొదట ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పి.జనార్దన్ కు సంతాపం తెలుపనున్నారు. అనంతరం శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశాలు జరుగుతాయి.

ఈ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలపై రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు షికారు చేస్తున్న ఈ సమయంలో జరుగుతున్న సమావేశాలపై ఆసక్తి నెలకొంది.

తెలంగాణ సమైక్యతా వారోత్సవాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళిత బంధు యూనిట్ల పెంపుతో పాటు ఏమైనా సంక్షేమ పథకాల అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.