• హాజరైన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్
• కేక్ కట్ చేసి స్వీట్లు పంచిన నేతలు
రచ్చబండ, హుజూరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఆదివారం హుజూరాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయము నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక శ్రీనివాస్, ఎంపీపీలు, జడ్పీటీసీలు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.