నా బర్త్ డే వేడుకలొద్దు.. వరద బాధితులకు సాయం చేయండి : కేటీఆర్

రచ్చబండ : రాష్ట్రవ్యాప్తంగా వర్షాలున్న కారణంగా జూలై 24న జరిగే తన పుట్టిన రోజునాడు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేడుకలు జరుపుకోవద్దని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ హితవు పలికారు.

వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తుతున్నాయని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. బర్త్ డే వేడుకలకు బదులుగా ‘‘గిఫ్ట్ ఏ స్మైల్’’ కార్యక్రమం కింద స్థానిక ప్రజలకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ పునరావాస కార్యక్రమాలకు మీరు చేదోడు వాదోడుగా నిలవాలని కోరారు. మీ అభిమానానికి మన:పూర్వక ధన్యవాదాలు అంటూ ఆ ప్రకటనలో తెలిపారు.