- హాజరైన కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
- అటవీ భూముల్లో మొక్కలు నాటిన నేతలు
రచ్చబండ, ఆమనగల్లు : రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల పరిధిలోని రాంనుంతల గ్రామంలో సర్పంచ్ సోనా శ్రీనునాయక్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి హాజరై కేకు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు.
గ్రామంలో ఉన్న 10 ఎకరాల అటవీ భూముల్లో మొక్కలను నాటారు. అనంతరం ఆమనగల్లు సుర సముద్రం చెరువు కట్టపై ఉన్న కట్ట మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ జక్కు అనంతరెడ్డి, జడ్పీటీసీ అనురాధ పత్యానాయక్, ఏఎంసీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరి యాదవ్, ఏఎంసీ డైరెక్టర్ సురమల్ల సుభాష్, కడ్తాల్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జోగు వీరయ్య, ముద్విన్ సర్పంచ్ యాదయ్య, కొనాపుర్ సర్పంచ్ యాదయ్య, టీఆర్ఎస్ నాయకులు ఎడ్లపల్లి రవికుమార్, వడ్డేమోని శివకుమార్, వడ్డేమాన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.