దూర దృష్టికి, సహనానికి కేటీఆర్ మారుపేరు

• పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి
• ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
• కేకు కట్ చేసి స్వీట్లు పంచిన నేతలు

రచ్చబండ, పరిగి : రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూర దృష్టికి, సహనానికి కేటీఆర్ మారుపేరని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి కొనియాడారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ఆదివారం కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు నిర్వహంచారు.

పరిగి మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, మెుక్కలు నాటే కార్యక్రమం నిర్వహంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా, అహర్నిశలు శ్రమిస్తూ, అనేక రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగి ఉన్న కేటీఆర్ దార్శనికత కలిగిన నేత అన్నారు.

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
పరిగి పట్టణంలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ కల్యాణ మండపంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రక్తదానం చేసిన దాతలకు ప్రశంసాపత్రాలను అందజేశారు.

అదే విధంగా నస్కల్ రోడ్డులో మొక్కలు నాటారు. నియోజక వర్గంలోని వివిధ మండల కేంద్రాల్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఎమ్మెల్యే తెలిపారు. రక్త దానం చేసిన ప్రతి దాతను అభినందించారు.

ఆయా కార్యక్రమాల్లో పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, జడ్పీటీసీ హరిప్రియా ప్రవీణ్ రెడ్డి, ఎంపీపీ అరవింద్ రావు, మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఎంపీపీలు సత్య హరిచంద్ర, మల్లేశం, జడ్పీటీసీలు నాగిరెడ్డి, రాందాస్ నాయక్, కౌన్సిలర్లు మీర్ తహర్ అలీ, వెంకటేష్, నాగేశ్వర్, మునీర్, రవికుమార్, మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, పలువురు టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.