కరోనా నివారణకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఎస్ఐ సర్దార్ నాయక్, సిబ్బంది కలిసి శనివారం వాహనదారులకు కరోనా నియంత్రణ కోసం ప్రచారం చేశారు. మెయిన్ రోడ్డుపై వెళ్లే వాహనదారులను నిలిపి మాస్క్ లేని ప్రతి ఒక్కరికీ ఉచితంగా మాస్కులు అందజేశారు. అందరూ మాస్కులు ధరించాలని అవగాహన కల్పించారు.