రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సమగ్రాభివృద్ధికి కృషి 

తెలంగాణ సీఎం కేసీఆర్

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సమగ్రాభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. శుక్రవారం నగరంలోని తన చాంబర్ లో సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. భవిష్యత్ అవసరాల కోసం సమీకృత కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. దీనికోసం ఒక నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎస్ ను ఆదేశించారు. నోడల్ అధికారి అధ్యక్షతన ప్రతి నెల సమావేశం కావాలని ఆదేశించారు. నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.