ప్రతీ మనిషి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరూ జబ్బులు రావాలని కోరుకోరు. కానీ మనం తినే ఆహారం, వ్యాయామం లేకపోవడంతోనే ఎక్కువగా వాటిని కొని తెచ్చుకుంటున్నారు. కానీ 50 ఏళ్లు దాటినా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటిస్తే ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది.
యాభై ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కూడా శారీరక శ్రమ తప్పక చేయాలనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి. నిత్యం ఎక్సర్ సైజ్ చేయాలి. ఇంటి పనుల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వాలి.
చెమటోడ్చే పనులు తరచూ చేస్తుండాలి. నడకకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఆఫీసుల్లో లిఫ్టులపై కాకుండా మెట్లపై నుంచి నడిచేందుకే ప్రాధాన్యం ఇవ్వండి.
కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలనే విషయం గుర్తుంచుకోవాలి. పంచదార, వేపుడు పదార్థాలకు మస్ట్ గా దూరంగా ఉండాలి. ఎక్కువ నీరు తాగడానికి ప్రయత్నించండి. తాజా ఆహార పదార్థాలు, పండ్లు ఎక్కువగా తీసుకోండి. ప్రొటీన్ ఉండే ఆహారాన్ని తీసుకుంటే మంచిది.
ఇటీవల విటమిన్-డి లోపంతో కొన్ని అనారోగ్యాలు దరి చేరుతున్నాయి. మనం ఆ విషయాన్ని గుర్తించి తప్పకుండా ఉదయం నీరెండలో సూర్యుడి కాంతి పడేలా నిల్చోవాలి. దీనిని నిత్యం పాటించాలి.
ఇవన్నీ అందరికీ తెలిసినా టేకిట్ ఈజీగా తీసుకుంటారు. కానీ ఇవన్నీ సులవైనవేనని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. వీటిని తప్పక పాటిస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుందని మాత్రం మరువకండి.