Minister Sabitha indrareddy.. భావితరాలకు వీరినారి ఐలమ్మ చరిత్ర తెలియాలి

  • విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • ప్రొద్దటూరులో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ
  • ఎమ్మెల్యే కాలే యాదయ్య, జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి హాజరు

రచ్చబండ, శంకర్ పల్లి: వీరనారి చాకలి ఐలమ్మ చరిత్ర ముందు తరాలకు తెలియాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మండలం ప్రొద్దటూరు గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే కాలే యాదయ్య, జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి సబితా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వచ్చాకనే ముఖ్యమంత్రి కేసీఆర్ మహనీయుల త్యాగాలను గుర్తించి సముచితమైన గౌరవం కల్పించారన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరీ విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు అని కొనియాడారు.

భావితరాలకు వీరి చరిత్ర తెలియాలనే ఐలమ్మ జయంతి, వర్ధంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు. ఆధునికత రాకతో కుల వృత్తులు కనుమరుగు అవుతుండటంతో బీసీ కులాల వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 2 కోట్లతో మోడ్రన్ ధోబీఘాట్లు నిర్మిస్తున్నట్లు, జిల్లాలో 16 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, 32 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు.

శంకర్ పల్లి మునిసిపాలిటీలో కూడా రెండు కోట్లతో మోడ్రన్ ధోబీఘాట్లు త్వరలో నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, చేవెళ్ల నియోజకవర్గంలో నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అభివృద్ధి చేస్తున్న కాలే యాదయ్య వెంటే నియోజకవర్గ ప్రజలు ఉండాలని చెప్పారు. కరోనా వల్ల ఆర్టీసీ సంస్థ నష్టాల్లోకి వెళ్లడంతో 43 వేల మంది కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా రేగులరైజ్ చేశారన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్ష పాతిగా,మహిళ సంక్షేమ కార్యక్రమాలతో మహిళ  పక్ష పాతిగా, దళిత పక్ష పాతిగా, బీసీ, మైనార్టీ పక్ష పాతిగా, ఉద్యోగాలు ఇస్తూ యువజన పక్ష పాతిగా నిలుస్తున్నారన్నారు. నాడు గ్రామాలకు వస్తే  కరెంట్,తాగునీటి కష్టాల గురుంచి వచ్చేవారని, రైతులు ట్రాన్సఫార్మన్లను ట్రాక్టర్లలో వేసుకొని రిపేర్లను తీసుకెళ్ళే వారని నేడు 24 గంటల ఉచిత విద్యుత్ తో ఆ కష్టాలు తీరీపోయాయన్నారు.

పల్లె ప్రగతితో స్వచ్ఛ గ్రామాలుగా మారాయని, సకల సౌకర్యాలు కల్పించబడ్డాయని, చివరి మజిలీ ప్రశాంతగా జరిగేలా వైకుంఠ దామాలు నిర్మించినట్లు కేంద్రం ఇస్తున్న ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులలో టాప్-20లో అన్ని గ్రామాలు తెలంగాణ రాష్టానివే ఉన్నాయాయని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను కాళేశ్వరం లాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి చేస్తారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, ఎంపీటీసీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి ,సర్పంచ్ నరసింహ్మ రెడ్డి, మార్కెట్ చైర్మన్ పాపారావు, వైస్ ఛైర్మన్ కురుమ వెంకటేష్ ,సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, మాజీ మార్కెట్, సొసైటి చైర్మన్లు రాజు నాయక్, మోహన్ రెడ్డి, పొద్దుటూరు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ నరసింహ, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్, గోవర్ధన్ రెడ్డి, జిల్లా రజక సంఘం ఉపాధ్యక్షుడు చాకలి మల్లేష్ సంఘం, పొద్దుటూరు రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.