ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ లో భారీగా చేరికలు

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ లో భారీగా చేరికలు
* చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
* శంకర్ పల్లి మున్సిపాలిటీ బుల్కాపురంలో 150 మంది చేరిక
* గులాబీ కండువా కప్పి స్వాగతం పలికిన ఎమ్మెల్యే

రచ్చబండ, శంకర్ పల్లి: సీఎం కేసీఆర్ చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శుక్రవారం శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని బుల్కాపురంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన 150 మంది కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలోకి చేరారు.

 

వారిని ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి స్వాగతించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రాబోయే రోజుల్లో భారీ సంఖ్యలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరికలు ఉంటాయన్నారు. దేశ రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించాలనుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అడుగులో అడుగులు వేస్తూ బి ఆర్ ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. గ్రామాల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీల నాయకులు చేస్తున్న కుట్రలను ప్రతి కార్యకర్త తిప్పి కొట్టి సరైన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు.

తాను ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని తెలిపారు. బుల్కాపురం శివారులో చెరువు కట్ట పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం శంకర్ పల్లి ప్రధాన చౌరస్తా లో బుల్కాపురం శివారు నుండి శంకర్ పల్లి ప్రధాన చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టం ను ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బిఆర్ అంబేద్కర్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఆసుపత్రి రహదారిలో మున్సిపల్ వారు నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, కమిషనర్ జ్ఞానేశ్వర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు, పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, మండల, మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కె. గోపాల్, వి. వాసుదేవ్ కన్నా, కౌన్సిలర్లు జూలకంటి లక్ష్మమ్మ రాంరెడ్డి, గోపాల్, పార్శి రాధా బాలకృష్ణ, జూలకంటి శ్వేత పాండురంగ రెడ్డి, ఎం. చంద్రమౌళి, గండేటి శ్రీనాథ్ గౌడ్, నాయకులు ఎస్. ప్రవీణ్ కుమార్, బొల్లారం వెంకటరెడ్డి, చేకూర్త గోపాల్ రెడ్డి, పార్శి బాలకృష్ణ, వెంకటయ్య, రాజేశ్వర్ గౌడ్, మహేందర్ రెడ్డి, బి. మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.