మౌలాలీ గల్లీల్లో ‘పుష్ప’రాజులు?

హైదరాబాద్ నగరంలో పుష్పరాజులు పుట్టుకొచ్చారు. పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం స్మగ్లింగ్ వెలుగులోకి రావడంతో రాచకొండ పోలీసు అధికారులు ఖంగుతిన్నారు.

మల్కాజిగిరి మౌలాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను వారు పట్టుకున్నారు.

అర కోటికి పైగా..
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉంటుందని అంచనా. అయితే రాచకొండ పోలీస్ ఏరియా పరిధిలో మొదటిసారి ఎర్రచందనం పట్టుకోవడంతో స్థానికులు కూడా ఆశ్యర్యానికి గురవుతున్నారు.