• ఏఏ రాష్ట్రాల్లో ఎక్కువున్నాయి?
• మన రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి?
మనదేశంలో ఒకప్పుడు సైకిల్ ఉందంటే అదే గొప్ప. అలాంటిది రానురాను బైకులు బహుగొప్ప అయ్యాయి. కానీ ఇప్పుడు ప్రతీ ఇంటికీ నిత్యావసరమైంది. పల్లెల్లో సంగతెలా ఉన్నా.. పట్టణాలు, నగరాల్లో ఇంటికో బైక్ ఉంది. కొన్నిళ్లలో బహుళ బైకులూ ఉంటాయి.
దేశంలో టూవీలర్లు వాడే కుటుంబాల సంఖ్య రానురాను పెరుగుతూ వస్తోంది. ఓ సర్వే ప్రకారం 2018 నాటికి దేశవ్యాప్తంగా 37.3 శాతం కుటుంబాలు బైకులు కలిగి ఉండగా, 2021 నాటికి అది 49.7 శాతానికి చేరింది. అంటే దేశంలోని సగం కుటుంబాలకు టూవీలర్లు ఉన్నాయన్నమాట.
గోవా రాష్ట్రంలో అత్యధిక టూవీలర్లు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. 86.7 శాతం కుటుంబాలు ద్విచక్ర వాహనాలు కలిగి ఆ రాష్ట్రం దేశంలోనే తొలిస్థానంలో ఉంది. అదే విధంగా పంజాబ్ 75.6 శాతం కుటుంబాలతో ద్వితీయ స్థానంలో ఉండగా, రాజస్థాన్ రాష్ట్రం 66.4 శాతం కుటుంబాలతో తృతీయ స్థానంలో ఉంది.
అదే మన తెలంగాణ రాష్ట్రంలోనైతే 55.3 శాతం కుటుంబాలు ద్విచక్ర వాహనాలు కలిగి ఉన్నాయి. ఈ మేరకు దేశంలో మన రాష్ట్రం 9వ స్థానంలో ఉంది.