శంకర్ పల్లి చౌరస్తాలో కాంగ్రెస్ విజయోత్సవ సంబురాలు

రచ్చబండ, శంకర్ పల్లి: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా శంకర్ పల్లి లో మండల కాంగ్రెస్ నాయకులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ప్రధాన చౌరస్తాలో టపాకాయలు కాలుస్తూ, మిఠాయిలు తినిపించుకున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో ప్రజలు సరైన తీర్పును ఇచ్చారని తెలిపారు. బిజెపి నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నిన ఎన్నికల్లో గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా రోడ్డు షోలు ఎన్ని చేసినా కాంగ్రెస్ గెలుపును ఆపలేకపోయారని చెప్పారు. ఇకనైనా బిజెపి నాయకులు ప్రజల నాడిని తెలుసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉదయ మోహన్ రెడ్డి, మండల, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, వై. ప్రకాష్ గుప్తా, నాయకులు ఎండి. ఎజాస్, రాములు, యాదయ్య, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, ప్రశాంత్, శివ, శశి, సుధాకర్, హుస్సేన్, శమీ, సంజయ్, తదితరులు పాల్గొన్నారు.