రచ్చబండ, శంకర్ పల్లి: 20 22- 23 విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో శంకర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల విద్యార్థి యు. ఆకాష్ మండలంలోని టాప్ లో నిలిచి9.3 జిపిఏ సాధించారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి అక్బర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. లక్ష్మయ్య విద్యార్థి ఆకాశం అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారని తెలిపారు.
మండలంలోని 11 జడ్పీహెచ్ఎస్ పాఠశాలలు ఉండగా అందులో శంకర్ పల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి మండలంలో టాప్ లో నిలవడం అభినందనీయం అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు మంజుల పాండును శాలులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణయ్య, కవ్వ గూడెం శ్రీను, మునీర్ పాషా, నారాయణ, సుల్తానా పాల్గొన్నారు.