Adarsha patashala.. ఢిల్లీ వేడుకల్లో శంకరపల్లి ఆదర్శ విద్యార్థుల ప్రతిభ

రచ్చబండ, శంకర్ పల్లి: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జాతీయ సాంకేతిక దినోత్సవంలో శంకర్ పల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ చాటి అందరి మన్ననలు పొందారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహేశ్వరావు మాట్లాడుతూ ఈనెల 11 నుంచి 14 వరకు జాతీయ సాంకేతిక దినోత్సవ వేడుకల్లో ఆదర్శ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. అటల్ టింకరిక్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయన్నారు.

విద్యార్థులు రూపొందించిన స్టూడెంట్ టు స్టార్ట్ అప్ విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకైక ప్రాజెక్టుగా శంకర్ పల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థులు రూపొందించిన ఆటోమేటిక్ ఫర్టిలైజర్ డిస్పెన్సరీ ప్రాజెక్టు ఈ సదస్సులో అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు.

ప్రాజెక్టు రూపొందించిన అమీర్, సందీప్ తల్లిదండ్రులు గొల్లగు మహమూద్, గొల్ల కృష్ణ తమ పిల్లల ప్రతిభ పాఠవాలను వెలికి తీసి జాతీయస్థాయికి తీసుకువెళ్లిన పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారన్నారు. అటల్ టింకరింగ్ సిఐజి ప్రతినిధులు సమీర్ కుమార్, రాజ్ కిషోర్లకు రుణపడి ఉంటామని వారి తల్లిదండ్రులు అన్నారని మహేశ్వరరావు తెలిపారు.