- చందిప్ప మరకత శివలింగానికి కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు
- ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం
రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని చందిప్ప గ్రామంలోని చారిత్రక మరకత శివలింగానికి సోమవారం సర్పంచుల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మిర్జాగూడ గ్రామ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 11వ శతాబ్దంలో చాణుక్య రాజులు ప్రతిష్టించిన ఆకుపచ్చ శివలింగానికి పూజలు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. పచ్చని వరి పొలాల మధ్య అహ్లాదకర వాతావరణంలో దేవాలయం పునర్నిర్మించడం అభినందనీయమన్నారు.
అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ సదానంద గౌడ్ తదితరులు రవీందర్ గౌడ్ దంపతులకు శివలింగం గల పటాన్ని అందించారు. కాగా కర్ణాటక రాష్ట్రం కలిబురుగ జిల్లా న్యాయమూర్తి కరణ్ గుజ్జర్ దంపతులు కూడా శివలింగానికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.