Mokila Villege.. మోకిలాలో ప్రారంభమైన సీఎం కప్ ఆటల పోటీలు

రచ్చబండ, శంకర్ పల్లి: మూడు రోజులపాటు జరిగే సీఎం కప్ ఆటల పోటీలు సోమవారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మోకిలలోని క్రీడా ప్రాంగణంలో ఉదయం ప్రారంభమయ్యాయి. క్రీడలను శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, పలు గ్రామాల సర్పంచులు అధికారులు ప్రారంభించారు.

కబడ్డీ, వాలీబాల్, కోకో, అథ్లెటిక్స్ తదితర క్రీడల్లో యువతీ యువకులు పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకయ్య, మున్సిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, సీఐ ప్రసన్నకుమార్, జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, మోకిలా, గోపులారం సర్పంచులు సుమిత్ర మోహన్ రెడ్డి, పొడవు శ్రీనివాస్, ఏపీవో నాగభూషణం, క్రీడలు నిర్వాహకులు పాపగారి ఆశీర్వాదం, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.