మేరా లైఫ్.. మేరా స్వచ్ఛ షహర్ కార్యక్రమంపై శంకర్ పల్లిలో అవగాహన

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం మేరా లైఫ్ మేర స్వచ్ఛ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో ప్లాస్టిక్ వస్తువులు వినియోగించడం తగ్గించాలని తెలిపారు.

భూమిలో కలిసిపోయే ప్లాస్టిక్ వస్తువులనే వాడాలని ప్రజలకు తెలియపరచాలని చెప్పారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం వల్ల రీసైక్లింగ్ చేయడంతో కంపోస్ట్ ఎరువులు చేయుటకు వీలవుతుందని తెలిపారు.

వార్డులలో ఆర్ ఆర్ ఆర్( రెడ్యూస్, రీ యూస్, రీసైకిల్) సెంటర్ల ఏర్పాటు గురించి స్క్రాప్ దుకాణాల యజమానులు, ఆశ వర్కర్లు, మెప్మా ఆర్పి లతో చర్చించడం జరిగిందని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు