ప్రణాళికాబద్ధంగా ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధి

ప్రణాళికాబద్ధంగా ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధి
* రూ.102 కోట్లతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు
* కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్

రచ్చబండ, ఆమనగల్లు:

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ సమగ్రాభివృద్దే ద్యేయంగా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ తెలిపారు. వివిధ పథకాల కింద రూ 102 కోట్లతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో బుధవారం టియుఎఫ్ఐడిసి నిధులు రూ.15 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సమిష్టి కృషి, ప్రజల భాగస్వామ్యంతో మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో మూడు పార్కుల నిర్మాణానికి రూ.2.10 కోట్లు, ఆమనగలు సురసముద్రం సుందరీ కరన పనులకు రూ .2.50 కోట్లు, గాంధీ చౌక్ నుంచి సురసముద్రం చెరువు కట్ట వరకు రూ 50 లక్షలతో సెంట్రల్ లైటింగ్, రూ .2.80 కోట్లతో అంతర్గత మురుగు కాలువల నిర్మాణం, రూ కోట్లతో సిసి రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వివరించారు.

అదేవిధంగా రూ 1.50 కోట్లతో గ్రంధాలయ భవన నిర్మాణం, 2.50 కోట్లతో కళాశాల భవన నిర్మాణం, రూ.4.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణం, రూ 2 కోట్లతో సేవాలల్ భవన నిర్మాణం, రూ 50 లక్షలతో వివిధ సామాజిక భవనాల నిర్మాణం,రూ.కోటి తో దోబి గాట్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఆమనగల్లు మున్సిపాలిటీలో మిషన్ భగీరథ అసంపూర్తి పనులకు 32 కోట్లు, ఆమనగల్లు తలకొండపల్లి బిటి రోడ్డు ఆధునికరణ పనులకు 37 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు.కోర్టు భవనాల మరమ్మతు పనులకు రూ.20 లక్షలు మంజరు అయ్యాయని జైపాల్ యాదవ్ వివరించారు.

ఆమనగల్లు మున్సిపాలిటీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి నిధులు మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిని సిహెహ్ సి గా మార్చి 30 పడకలకు పెంచామని త్వరలో భవన నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆమనగల్లు విటాయిపల్లి మధ్య నుంచి త్వరలో త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని చెప్పారు.

తద్వారా ఆమనగల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పడి నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని జైపాల్ యాదవ్ పేర్కొన్నారు. అందరి సహకారంతో కల్వకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలో అగ్రభాగాన నిలిపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గానికి ప్రధాన కేంద్రమైన ఆమనగల్లు అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. ఆమనగల్లు పాత బీసీ హాస్టల్ వద్ద రూ. 2 యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జయపాల్ యాదవ్ వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు కృష్ణ, సుజాత రాములు, విక్రమ్ రెడ్డి, దుడ్డు కృష్ణ యాదవ్, గోరటి జ్యోతినరసింహ, దివ్య శ్రీకాంత్ సింగ్, తల్లోజు విజయ్ కృష్ణ, కమటం రాధమ్మ వెంకటయ్య, సోనీ జయరాం, చెన్నకేశవులు, సుoడూరు ఝాన్సీ శేఖర్, బైకని యాదమ్మ శ్రీశైలం యాదవ్, చెక్కల లక్ష్మణ్, డిఈ యాదయ్య, ఏఈ భార్గవ్, బి ఆ ర్ఎస్ మండల అధ్యక్షుడు పొనుగోటి అర్జున్ రావు, నాయకులు సుక్క నిరంజన్ గౌడ్, సయ్యద్ ఖలీల్, మాసుం, జయరాం, ఎంగలి బాలకృష్ణ, గోరటి నరసింహ, శ్రీకాంత్ సింగ్, ఎంగలి రఘు, తల్లోజి రామకృష్ణ ,సుండురు శేఖర్, జంతుక కిరణ్, తోట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.