కుక్కలున్నాయా జాగ్రత్త!

ఇదేంది కుక్కలున్నాయి జాగ్రత్త కదా.. అని అనుకుంటున్నారు కదా.. కానీ ఇక్కడ ఇదే కరెక్ట్. కుక్క అంటే విశ్వాసానికి మారు పేరుగా అంటుంటారు. కానీ అది అతి విశ్వాసమై అసలుకే మోసం వచ్చిందిక్కడ.

ఓ పెంపుడు కుక్క తన యజమానికి ఊహించని షాక్ ఇచ్చింది. తను దాచుకున్న నగదును నోట కరిచి ఆ కుక్క ఎక్కడో పడేసింది. దీంతో ఆ యజమాని లబోదిబోమంటున్నాడు. ఎంత వెతికినా దొరకక తలపట్టుకున్నాడు.

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో ఒక గొర్రెల పెంపకందారుడు ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. తాను దాచుకున్న రూ.1.50 లక్షల నగదు సొమ్మును తన నడుముకు కట్టుకునే జోలె సంచిలో పెట్టుకున్నాడు.

ఈనెల 25న నడుముకు ఉన్న ఆ సంచిని తీసి మంచంలో పెట్టి స్నానానికి వెళ్లాడు. ఆకర్షించే రంగులో ఉందో.. ఎమనుకుందో.. ఏమో అక్కడే ఉన్న ఆ కుక్క తన నోట కరుచుకొని దానిని తీసుకెళ్లింది. ఎక్కడ పడేసిందో ఇంత వరకూ తెలియలేదు. ఎంత వెతికినా ఆచూకీ దొరకడం లేదు. అందుకే కుక్కలున్న వారు జాగ్రత్త సుమీ!