జీహెచ్ఎంసి పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం !

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని మండిపడింది. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని.. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.