‘చావు కబురు చల్లగా’ ట్రైలర్

యువ హీరో కార్తికేయ – లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ”చావు కబురు చల్లగా”. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు పెగళ్ళపాటి కౌశిక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్ రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ – టీజర్ మరియు లిరికల్ సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.